బాహుబలి 2 పై వర్మ షాకింగ్ ట్విట్ !


అర్దరాత్రి నుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభం అయిన ‘బాహుబలి 2’ సునామి తొలి ఫలితాలు బయటకు వస్తున్నాయి. ఈసినిమాను చూసిన ప్రేక్షకులు రాజమౌళి అద్భుతమైన మేకింగ్ మ్యాజిక్ కు షాక్ అవ్వడమే కాకుండా ఇలాంటి సినిమాలను తీయగల సత్తా ఒక్క రాజమౌళికే ఉంది అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఈసినిమా పై సామాన్య ప్రేక్షకుల స్పందన బయటకు రావడానికి మరి కొంత సమయం పడుతుంది.

ఈసినిమా పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల వర్మ కూడ తన అభిప్రాయాన్ని వెల్లడించి ట్విట్ పెట్టాడు. ఈసారి ‘బాహుబలి 2’ ని ఏకంగా డైనోసార్ తో పోల్చాడు వర్మ. "ఒక ఏనుగు సినిమా వస్తుంటే.. కుక్కల్లాంటి సినిమాలు చాలా మొరుగుతూ ఉంటాయి. కానీ బాహుబలి డైనోసార్ కావడంతో.. కుక్కలు.. పులులు.. సింహాలు అన్నీ దాక్కున్నాయి" అంటూ షాకింగ్ ట్విట్ పెట్టాడు వర్మ. అంతేకాదు అత్యంత భారీగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి దారి ఇవ్వడంతో పాటు ఆ సునామీలో కొట్టుకుపోకుండా ఫిలిం మేకర్స్ జాగ్రత్తపడిన విషయాన్ని వర్మ గుర్తుకు చేస్తూ ‘బాహుబలి 2’ ను ఆకాశంలోకి ఎత్తేస్తున్నాడు వర్మ.

ఇది ఇలా ఉండగా నిన్న అర్దరాత్రి నుండి మన ఇరు రాష్ట్రాలలోను ‘బాహుబలి 2’ ధియేటర్స్ వద్ద ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈసినిమాను ఎట్టి పరిస్థితులలోను ఈరోజే చూసి తీరాలి అని అభిమానులకు ఏర్పడ్డ క్రేజ్ ను క్యాష్ చేసుకునే విధంగా ఈమూవీ టిక్కెట్లు మన ఇరు రాష్ట్రాలలోని చాల ప్రాంతాలలో 3000 వేల రూపాయల వరకు బ్లాక్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

‘దంగల్‌’, ‘పీకే’ చిత్రాల మొదటి రోజు కలక్షన్స్ ను ఈసినిమా ఈరోజు బ్రేక్ చేయబోతున్న నేపధ్యంలో ‘బాహుబలి 2’ తర్వాత ఇక ఇండియాలో ఏ రికార్డు మిగలదు అన్న అభిప్రాయాన్ని ఇప్పటికే బాలీవుడ్ మీడియా అంగీకరిస్తోంది. ఈ చిత్రం హిందీ వెర్షన్‌ కి  హాలిడే రోజుకాకపోయినా జరిగిన బుకింగ్స్ చూసి బాలీవుడ్‌ మీడియా విస్తుపోతోంది.

బాలీవుడ్ టాప్ హీరోలు ఖాన్‌లు కాకుండా మరే హీరో వల్ల కాని రికార్డులను ఒక తెలుగు అనువాద చిత్రం వచ్చి బాక్సాఫీస్‌ ని కుదిపి వేయడం షాకింగ్ గా మారింది. ఈ క్రేజ్ ను చూసి వర్మ లాంటి సెటైర్లు వేసే దర్శకుడు కూడ ‘బాహుబలి 2’ డైనోసార్ తో పోల్చడంతో ఇక ‘బాహుబలి 2’ మ్యానియాకు ఎదురులేదు అనుకోవాలి..