షాకింగ్ & బ్రేకింగ్: నెట్‌లో బాహుబలి2 మొదటి 50 నిమిషాల సినిమా!
పైరసీ సినిమాలను ప్రోత్సహించే ఓ ప్రముఖ పైరసీ మూవీ సైట్‌లో కూడా బాహుబలి2 50 నిమిషాల సినిమా హల్‌చల్ చేస్తోంది. పోలీసులు, ఫ్యాన్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ పైరసీని నియంత్రించలేకపోతున్నారు. పైగా డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుండటంతో ఇంకెంత మందికి ఈ పైరసీ ప్రింట్ షేర్ అవుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పైరసీ లింక్ వాట్సాప్‌లో వైరల్ అవుతుండటం మరింత కలవరపాటుకు గురిచేసే విషయం. సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ ప్రింట్ అందుబాటులోకి రావడం వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇన్నేళ్లుగా లక్షల మంది కష్టానికి ప్రతిరూపంగా తెరకెక్కిన ఈ సినిమా పైరసీని చూసి పొట్ట కొట్టొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.