తమ్ముడే కదా ఆదరిస్తాడని అనుకుంటే ఐదేళ్లుగా బెదిరిస్తూ అత్యాచారం

సొంత కజినే కామంధుడిగా మారాడు. తమ్ముడే కదా ఆదరిస్తాడని అనుకుంటే ఐదేళ్లుగా బెదిరిస్తూ అత్యాచారం జరిపాడు. ఈ సంఘటన ఒడిషా, గుర్గావ్ లలో జరిగింది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఓ ఒరిస్సాలోని మణిపూర్ కు చెందిన ఓ యువతి (27) 2012 అమ్మనాన్నలు చనిపోయారు. అదే సమయంలో తన పెద్దమ్మ కొడుకు (22)కు పెళ్లి కావడంతో ఉపాధి కోసం ఢిల్లీలోని గుర్గావ్ కు వలసవెళ్లాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు.

గుర్గావ్ నుంచి అప్పుడప్పుడు ఒడిషాకు వచ్చిన తన కజిన్ (సోదరి)ను పరామర్శించిపోతూ ఉండేవాడు. అలా వచ్చిన ప్రతిసారి బలవంతంగా అత్యాచారం జరిపాడు.

ఆ తర్వాత బ్యూటీషియన్ కోర్సు చేయిస్తానని తనతోపాటు ఆమెను గుర్గావ్ తీసుకెళ్లాడు. అక్కడ కూడా భార్య ఇంట్లో లేని సమయంలో పలుమార్లు అత్యాచారం జరిపాడు. విషయం బయటికి చెప్పినా ఎవరూ నమ్మరని బెదిరిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడేవాడు.

అతడి ఆగడాలు శృతిమించిపోవడంతో బాధిత యువతి మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.