పెళ్ళైనవారు ఆ 2 రోజులలో ఈ పని మాత్రం చేస్తే… దరిద్రం పట్టుకుంటుంది…


చాలామంది రోజు తలస్నానం చెయ్యడానికి ఇష్టపడతారు. అందులోను పెళ్ళైన ఆడవారు కొందరు రోజు తలస్నానం చేయ్యనిదే ఏ పని మొదలు పెట్టరు. అలాంటి వారు పరవాలేదు కాని, వారానికి ఒకటి రెండు సార్లు తల స్నానం చేసేవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్లు తలస్నానం చేస్తుంటారు. శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం ఎట్టిపరిస్థితుల్లోనూ చేయరాదు. మంగళవారం, శుక్రవారం పెళ్ళైన ఆడవారు తలస్నానం చెయ్యడం మంచిదికాదు. దాని వలన సకల సౌఖ్యాలకు దూరం అయ్యి, దరిద్రం పట్టుకుంటుంది. రోజూ తలస్నానం చేసే వారికి అలాంటి నియమాలు ఉండవు.

అసలు ఏరోజుల్లో తలస్నానం చేస్తే అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం…
సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం ఉంటుంది.
అలాగే వివాహమైన వారు తప్పనిసరిగా ప్రతి బుధవారం తలస్నానం చేయాలని హిందూ పురాణాలు చెపుతున్నాయి. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంగా, ఎంతో అన్యోన్యంగా ఉంటారట.
శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది.