ఆయుర్వేదం పేరుతో హానికరమైన ప్రాడక్ట్ అమ్ముతున్న రాందేవ్ బాబా

ఇక్కడ ఎవరైనా బాబా రాందేవ్ భక్తులు, అభిమానులు ఉంటే వారికి ఈ వార్త నచ్చకపోవచ్చు కాని, వాస్తవాల్ని కాదనలేం కదా. యోగా శిక్షణతో ప్రజలకి, భక్తులకి చేరువైన బాబా రాందేవ్, పతంజలి అనే ఓ సంస్థని స్థాపించి ఆయ్ర్వేద ప్రాడక్ట్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. మెల్లిగా పతంజలి పూర్తిగా ఓ వ్యాపార సంస్థగా మారిపోయింది. పతంజలి ఆయుర్వేద ప్రాడక్స్ నుంచి పతంజలి బిస్కెట్స్, పతంజలి షాంపూల వరకు చాలారకాల ప్రాడక్ట్స్ మార్కెట్లోకి వదిలారు బాబా రాందేవ్. తమ సంస్థ నుంచి వస్తున్న అన్ని ఉత్పత్తులు పూర్తిగా ఆయుర్వేదాన్ని ఆధారంగా చేసుకోని తయారుచేసినవి అని, ఆరోగ్యకరమైనవి అని, బయటి ఉత్పత్తుల్లా కెమికల్స్ వాడలేదని ఇన్నాళ్ళు బాగానే డప్పు కొట్టారు. కాని ఈ మధ్య జరిగిన ఏ టెస్టులో ఫలితం మరోలా వచ్చింది.

క్యాంటీన్ స్తోర్స్ డిపార్ట్మెంట్ ఇటివలే పశ్మిమ బెంగాల్ లోని ఓ పబ్లిక్ హెల్త్ లాబోరేటరిలో పతంజలి ఉత్పత్తి చేస్తున్న “పతంజలి ఆమ్లా జ్యూస్” మీద ఓ టెస్టు నిర్వహించింది. అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆ టెస్టులో పతంజలికి సంబంధించిన ఈ ప్రాడక్టు ఫెయిల్ అయ్యింది. ఇది ఆరోగ్యకరమైన ప్రాడక్ట్ కాదు అని, దీన్ని వెంటనే మిలిటరీ క్యాంటిన్ల నుంచి తొలగించాలని భారత డిఫెన్స్ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఆర్మీ అధికారులు కూడా ఈ ప్రాడక్టు మీద తమ అనుమానాలు వ్యక్తం చేయగా, రక్షణ శాఖ పతంజలి కంపెని, బాబా రాందేవ్ కి షోకాజు నోటీసులు కూడా పంపించింది.

ప్రస్తుతానికైతే ఆర్మీ క్యాంటీన్స్ లో పతంజలికి సంబంధించిన ఈ ఉసిరికాయ రసం బ్యాన్ చేయబడింది. పంపిణీదారుల డబ్బులు రీఫండ్ చేయబడతాయట. ఇదిలా ఉంటే బాబాజి భక్తులు మాత్రం బాబా ఇమేజ్ ని దెబ్బతీయడానికి పన్నిన కుట్ర అని అంటున్నారు. పతంజలి ఆమ్లా జ్యూస్ పూర్తిగా సురక్షితమని, మనుషులు ఎటువంటి అనుమానం లేకుండా తాగాల్సిన ఉత్పత్తి అని బాబాజి వారి భక్తుల వాదన. మరి బాబా మీద కుట్ర పన్నాల్సిన అవసరం మిలిటరీ వారికి ఎందుకు వచ్చింది అంటారు ?