రివ్యూ : నిన్ను కోరి – ఫ్రెష్ లవ్ స్టోరీ


టైటిల్ : ‘ నిన్నుకోరి‘ (2017)
స్టార్ కాస్ట్ :నాని, నివేథా థామస్‌, ఆది పినిశెట్టి తదితరులు.. దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాతలు: దానయ్య డి.వి.వి
మ్యూజిక్ : గోపీసుందర్‌
విడుదల తేది : జులై 07, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

ప్రేక్షకులకు ఎలాంటి కథ అయితే బాగుంటుందో కరెక్ట్ గా అంచనా వేస్తూ వరుస పెట్టి చిత్రాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్న నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మించిన ‘నిన్నుకోరి’ చిత్రం తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేక్షకుల్లో సైతం నాని నుండి సినిమా అంటే ఏదో తెలియని ఆసక్తి నెలకొని ఉంటుంది..ఇప్పుడు ఈ మూవీ ఫై కూడా అలాగే ఏర్పడింది. ట్రైలర్ ఎంతో ఆసక్తిగా ఉండడం తో ఈ సినిమా ఎలా ఉండబోతుందా..అనే ఆత్రుత ఏర్పడింది. మరి ఆ ఆత్రుత కు నాని ఎలా నాయ్యం చేసాడు..అసలు కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :
ఉమ (నాని) పీహెచ్‌డీ చేస్తూనే పల్లవి (నివేదా థామస్ ) తో ప్రేమలో పడతాడు. ఇద్దరు గాఢమైన ప్రేమలో మునిగిపోతారు. ఈ లోపు పల్లవి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టడం తో , ఎలాగైనా మనం పెళ్లి చేసుకోవాలని ఉమను తొందర పెడుతుంది. కానీ ఉమ మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని , లైఫ్ లో ఇంకా సెటిల్ కాలేదని , పీహెచ్‌డీ పూర్తి చేసాక పెళ్లి చేసుకుంటానని చెప్పు ఢిల్లీ వెళ్లతాడు. ఈ లోపు పల్లవి ఇంట్లో అరుణ్ (అది) తో పల్లవి పెళ్లి చేసి అమెరికా కు పంపుతారు. ఈ విషయం తెలుసుకున్న ఉమ , ఎంతో బాధపడుతూ తన జ్ఞాపకాలతో బతుకుతూ , ఇదొక రోజు పల్లవి తన కోసం వస్తుందనే ఆశతో ఎదురుచూస్తుంటాడు..ఓ రోజు పల్లవి ఉమను వెతుకుంటూ వస్తుంది..కానీ పల్లవి వచ్చింది ఉమ కోసం కాదు..మరి దేని కోసమో..? మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :
* నాని – నివేద – ఆది ల యాక్టింగ్
* మ్యూజిక్
* సెంటిమెంట్

మైనస్ :
* మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం
* కామెడీ
* సన్నివేశాల సాగదీత

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
* ముందుగా నాని, నివేథా థామస్‌ ల యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి.. నాని సెంటిమెంట్ సన్నివేశాల్లో బాగా నటించాడు. అలాగే తనదయిన కామెడీ పంచ్ లతో నవ్వించే ప్రయత్నం చేసి మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక నివేదా థామస్ యాక్టింగ్ పరంగానే కాక అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇక కీలక రోల్ చేసిన ఆది పినిశెట్టి క్లైమాక్స్ లో ప్రాణం పోసాడు..ముగ్గురు ముగ్గురే అనిపించుకున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర పాత్రల్లో నాయ్యం చేసారు.

సాంకేతిక విభాగం :
* గోపీసుందర్‌ మ్యూజిక్ తో పాటు నేపధ్య సంగీతం కూడా ఎంతో బాగా ఇచ్చాడు. కథ కు తగట్టు అతడి సంగీతం ఆకట్టుకుంది. కోన వెంకట్‌ అందించిన స్క్రీన్ ప్లే , మాటలు బాగున్నాయి.. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే కార్తీక్‌ ఘట్టమనేని అమెరికా లోని అందమైన లొకేషన్స్ ఎంతో అందంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ ఎంతో బాగుంది.
* నిర్మాత దానయ్య డి.వి.వి. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు.
* ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్న శివ నిర్వాణ..అందరూ పెళ్లి కి ముందు ప్రేమ ను తెరకెక్కిస్తే , ఈయన మాత్రం పెళ్లి తర్వాత ప్రేమను చూపించాడు. ద‌ర్శ‌కుడు కొత్త‌వాడైనా ఎక్క‌డా క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా, సింపుల్‌గా, ఎలాంటి త‌డ‌బాటు లేకుండా తెర‌కెక్కించాడు.

చివరిగా :
అన్ని కథల కాకుండా దర్శకుడు కొత్త కథ నే ఎంచుకున్నాడు. త‌ను ప్రేమించిన వాడి గురించి భ‌ర్త‌కు చెప్పి, మాజీ ప్రియుడి క్షేమాన్ని కాంక్షించి, భ‌ర్త‌తో స‌మాలోచించి… ఓ సంద‌ర్భంలో త‌న ఇంటికే అత‌న్ని ఆహ్వానించ‌డం అనేది ఇందులో దర్శకుడు చెప్పిన పాయింట్‌. కథ అంత ముగ్గురి చుట్టూ తిరుగుతుంది..

కాకపోతే ఈ మూవీ ఎక్కువగా క్లాస్ ఆడియన్స్ దృష్టి లో పెట్టి తెరకెక్కించారమో అనిపిస్తుంది. ఎందుకంటే మాస్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయి. నాని గత చిత్రాల కామెడీ తో పోలిస్తే ఇందులో కాస్త కామెడీ డోస్ తగ్గింది. ఓవరాల్ గా సినిమా ఓపెనింగ్ బాగుంటుంది..ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి పెంచుతుంది..మళ్లీ క్లైమాక్స్ బాగుంటుంది..ఇక మధ్య మధ్యలో వచ్చే సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయి.