అక్కడ పెళ్ళి చేసుకుంటే మూడు రోజుల వరకు అది కట్..!


మనకు రకరకాల సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. వారి వారి సాంప్రదాయాల ఆధారంగా వివాహాలు జరుగుతాయి. కొన్ని వివాహాలు చాలా వింతగా, విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు చదవబోయే పెళ్లి అత్యంత విచిత్రమైన వివాహ శైలి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఇండోనేషియాలో టాంగ్డా వర్గానికి చెందిన ప్రజల వివాహ వేడుక.. ఎవరూ కనని, వినని రీతిలో ఉంటుంది. అసలు వివరాల్లోకి వెళ్తే..

ఇండోనేషియాలో టాంగ్డా వర్గంలో పెళ్లయిన తరువాత కొత్త జంటకు మూడు రోజుల వరకూ టాయిలెట్‌కు వెళ్లేందుకు పెద్దలు అనుమతినివ్వరు. వినడానికి ఇది విచిత్రంగానే ఉన్నప్పటికీ, అక్కడి పెద్దలు ఇప్పటికీ ఈ సాంప్రదాయన్ని కొనసాగిస్తున్నారు.

ఇలా చేయడం వెనుక ఒక కారణం కూడా ఉందని వారు అంటున్నారు. పెళ్లయిన తరువాత మూడు రోజులలోగా కొత్తజంట టాయిలెట్‌కు వెళితే.. అది వారి అదృష్టాన్ని దెబ్బతీస్తుందని అనేది వాటి నమ్మకం. ఇలాచేస్తే వారి వివాహ బంధం కలకాలం నిలవదని, మధ్యలోనే ఎవరో ఒకరు మరణిస్తారని చెబుతున్నారు. అందుకే అక్కడ పెళ్లయిన కొత్త జంట మూడు రోజుల పాటు తక్కువ మోతాదులోనే ఆహారం తీసుకుంటుంది. ఈ మూడు రోజుల తరువాతే పెళ్లి కుమారుడు, కుమార్తె స్నానంచేసి, తమ వైవాహిక జీవితాన్ని మొదలు పెడతారు.