బాహుబలి 2 : రివ్యూ


What Is Good
ప్రభాస్ నటన
గ్రాడియర్ విజువల్స్
మ్యూజిక్

What Is Bad
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
మితీమీరిన హీరోయిజం

Bottom Line: రాజమౌళి మ్యాజిక్ తో వచ్చిన బాహుబలి-2..!

Story
బాహుబలి పార్ట్ 1 ఎక్కడ ఆపాడో అక్కడ నుండి పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. బిగినింగ్ ను గుర్తు చేస్తూ వచ్చే టైటిల్ బాగుంటాయి. రాజమాత శివగామిని కాపాడే క్రమంలో అమరేంద్ర బాహుబలి ఏనుగుతో ఫైట్ చేస్తాడు. రాజైన అమరేంద్ర బాహుబలి కుంతల దేశ రాజకుమారి దేవసేన (అనుష్క)ను చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా సరే దేవసేనను మాహిష్మతికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కుంతల రాజ్యంలోనే ఉండగా సడెన్ గా అమరేంద్ర బాహుబలి మీద ఉన్నవి లేనివి చెప్పి భళ్లాలదేవ (రానా)ను రాజుగా ప్రకటిస్తుంది శివగామి. శివగామి ఎందుకు అలా చేసింది..? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? శివుడు భళ్లాలదేవుడిని ఎలా ఎదుర్కున్నాడు..? అన్నది అసలు కథ.

Star Performance
బాహుబలి బిగినింగ్ లో లానే సినిమాలో అన్ని పాత్రలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ అదరగొట్టేశాడు. శివుడు, బాహుబలి రెండు వేరియేషన్స్ లో ప్రభాస్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక మొదటి పార్ట్ లో మొత్తం ఓల్డ్ గెటప్ లో కనిపించిన దేవసేన అనుష్క తన అందంతో కంక్లూజన్ లో ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ప్రభాస్, అనూష్కల జంట స్క్రీన్ పై మరోసారి సూపర్ అనిపిస్తుంది. ఇక భళ్లాలదేవగా రానా తన వీరత్వం చూపించాడు. ప్రభాస్ తో పోటీ పడిమరి నటించి మెప్పించాడు రానా. శివగామి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడమే కాదు సినిమాకే అందం తెచ్చిన పాత్ర శివగామి. బిజ్జల దేవగా నాజర్ ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

Techinical Team
రాజమౌళి ఐదేళ్ల కృషి బాహుబలి సినిమా.. ముఖ్యంగా బిగినింగ్ కన్నా సెకండ్ పార్ట్ కోసం ఎక్కువ కష్టపడ్డాడని చెప్పొచ్చు. అయితే మొదటి భాగం మొత్తం తన మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. గూస్ బమ్స్ ఎపిసోడ్స్ తో నింపిన రాజమౌళి సెకండ్ హాఫ్ మాత్రం అంత ఆకట్టుకునేలా తీయలేదు. రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాతో పాటుగా కుటుంబ రాజకీయాలతో నడిపించినట్టుగా ఉంటుంది. బాహుబలి 1 కన్నా ఇందులో విజువల్ పరంగా గ్రాండియర్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ సూపర్. కీరవాణి మ్యూజిక్ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సినిమా ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా తీశారని ఆ రిచ్ నెస్ ను చూస్తే అర్ధమవుతుంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది. ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటే బాగుండేది.

Analysis
బాహుబలి బిగినింగ్ రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన నాటి నుండి పార్ట్ 2 కోసం ఎదురు చూడని సిని ప్రేక్షకుడు లేడు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయినట్టే. సినిమా మొదటి భాగం ముఖ్యంగా ఇంటర్వల్ సీన్స్ లో తన పట్టు సాధించిన రాజమౌళి సెకండ్ హాఫ్ కాస్త పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. మళ్లీ క్లైమాక్స్ వార్ సీన్ బాగానే తీసినా సెకండ్ హాఫ్ శివుడు రోల్ అంత ఇంట్రెస్టింగ్ గా రంజింపచేయలేదు.
స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు సమాధానం ప్రేక్షకులు మెప్పు పొందేలా సమాధాన పరచినా అది ఎందుకో కనెక్ట్ అయినట్టు అనిపించదు. ఇక మితీమీరిన హీరోయిజం తో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లు ఉన్నట్టుగా అనిపిస్తుంది.

విజువల్ ట్రీట్ పరంగా ఎక్కడ గ్రాండ్ నెస్ తగ్గకుండా చూశారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడని అద్భుతాలను చూపించారు. కాని కథ పరంగా మాత్రం ఏమి ఆకట్టుకోలేకుండా చేశారు. విజువల్స్ తో ఎంత మాయ చేసినా అవుట్ అండ్ అవుట్ గా ఆడియెన్స్ ఇంప్రెస్ చేయాల్సిన కథ కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే అవకాశం అంతగా కనిపించదు.

సినిమా కన్నుల పండుగగా ఉన్నా తెలుగులో సీక్వల్ మూవీస్ కు కాలం కలిసిరాదు అన్న సెంటిమెంట్ ను నిజం చేస్తుందని అనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా అనిపిస్తుందేమో కాని రెగ్యులర్ సిని లవర్స్ కు నచ్చుతుంది.. అయితే అంచనాలు తారాస్థాయిలో ఉండటం వల్ల సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చెప్పలేం.