మాజీ ప్రియుడు నాతో పడుకుంటావా అని అడిగినందుకు... ఆ ప్రముఖ హీరోయిన్ ఏం చేసిందంటే...
ఇంతలో ఆమె ఎలాగోలా తప్పించుకొని ఇంటిలోకి చేరుకుంది. ఈ విషయమై ఆమె రాజగోపాల్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 354 కింద సచిన్, ప్రవీణ్ అలియాస్ పుట్ట మీద కేసులు నమోదు చేశారు. ప్రవీణ్, వర్థమాన నటి గతంలో స్నేహితులు. ప్రవీణ్ ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె అతన్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టింది. తనను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని.. ఒప్పుకోనందుకు ఎన్నో సార్లు బెదిరించాడని.. వాట్సప్ లో అశ్లీల ఫోటోలు.. అభ్యంతకర మెసేజీలు పంపేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఆదివారం ఒంటరిగా వెళుతున్న తనను కారులో వెంబడించడమే కాకుండా తనను బలాత్కరించాలని ప్రయత్నించారని ఆమె తెలిపింది.